Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

అట్లాంటాలో “ఆప్త” కన్వెన్షన్..!

APTA (American Progressive Telugu Association) వారు ఈ రోజు హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్ లో తమ 15వ కన్వెన్షన్ ప్రారంభ సన్నాహాల్లో భాగంగా ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు.

సెప్టెంబర్ ఒకటి నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సు గురించి మరియు అప్త చేస్తున్న వివిధ సేవల గురించి మరియు అమెరికాలో తెలుగు కమ్యూనిటీ కి వారు చేస్తున్న సహాయ సహకారాలగురించి అప్త ప్రతినిధులు వివరించారు.
అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ 15 ఏళ్ల జాతీయ కన్వెన్షన్.. జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో.. సెప్టెంబర్ ఒకటి నుంచి మూడు వరకు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ అధ్యక్షుడు కొట్టే ఉదయ భాస్కర్, కన్వీనర్ విజయ్ గుడిసేవ ప్రకటించారు. సెప్టెబరులో జరిగే ఈ సదస్సుకు సుమారు 7000 మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారని తెలియజేశారు.

ఆప్త పూర్వ అధ్యక్షులు గోపాల్ గూడపాటి మాట్లాడుతూ పేద విద్యార్థులకు చదువుకోసం APTA ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ అందిస్తుందని, 50లక్షలతో మొదలైన ఈ ప్రోగ్రాం ఇప్పుడు 3 కోట్ల రూపాయల వరకు చేరుకుందని ఇప్పటి వరకు 8400 కు పైగా విద్యార్థులకు స్కాలర్షిప్ అందించామని ఇక ముందు కూడా మరింత మందికి సహాయం చేస్తామని చెప్పారు. అలానే అప్త చేసే వివిధ సేవల గురించి వివరించారు.

రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నాయకులకు, కళాకారులకు, వివిధ రంగాలలో నిష్ణాతులకు, దాతలకు, వ్యాపారవేత్తలకు, ఇతర వివిధ రంగాల వారికి ఆహ్వానాలు అందజేసినట్టు వివరించారు. 15 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ సంస్థ చదువు, సేవే పరమార్థంగా పనిచేస్తుందని తెలిపారు. మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నట్టుగా వివరించారు. అమెరికాకు వచ్చే వేలాదిమంది విద్యార్థులకు ఇమ్మిగ్రేషన్ సేవలు విద్య ఉపాధి సౌకర్యాలను కూడా కల్పించేందుకు తాము కృషి చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఆప్త కన్వెన్షన్ కు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులందరూ తరలి రావాల్సిందిగా కోరారు. తెలుగు సంఘాలు ఎన్ని ఉంటే అంత మేలు జరుగుతుందని అమెరికాలో ఎవరికీ ఎవరు పోటీ కాదని అందరం కలిసి మెలిసే పని చేస్తామని వారు చెప్పారు. ప్రశ్నించుకుంటాం తప్ప ఒకరికి ఒకరు పోటీ కాదనే అభిప్రాయాన్ని సబికులందరూ వ్యక్తం చేశారు. త్వరలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాలలోనూ మీడియా సమావేశాలు నిర్వహించి తమ సదస్సు ఉద్దేశాలను వివరిస్తున్నట్టు తెలిపారు. తెలుగు అంటే రెండు రాష్ట్రాలే కాదని ఐదు రాష్ట్రాలకు పైగా ప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని.. అమెరికాలోని అప్త సేవ కార్యక్రమాలను ఈ రాష్ట్రాల ప్రజలకు అందిస్తున్నట్టుగా తెలిపారు. సదస్సు కర్తవ్యాన్ని మర్చిపోకుండా సుమారు 500 మంది వాలంటీర్లు నిరంతరం పనిచేస్తున్నారని చెప్పారు.

మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు ఉదయభాస్కర్ కొట్టే, కన్వీనర్ విజయ్ గుడిసేవ, ఆప్త ఫౌండర్ చిమట శ్రీనివాస్, పూర్వ అధ్యక్షులు గోపాల్ గూడపాటి, కో కన్వీనర్ వెంకట్ మీసాల, మీడియా చైర్ చంద్రశేఖర్ పోలిశెట్టి, పొలిటికల్ ఫోరమ్ అడ్వైజర్ అడ్డా బాబి తదితరులు ప్రసంగించారు.

Related Posts

Latest News Updates