Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

అగ్నిపథ్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్మీ

అగ్నిపథ్ స్కీం కింద అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ నోటిఫికేషన్ ను భారత సైన్యం విడుదల చేసింది. ఈ యేడాది జూలై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని ఆ నోటిఫికేషన్లో పేర్కొంది. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత ఆర్మీ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్నిపథ్ స్కీంను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని భారత ఆర్మీ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.

ఇక.. అగ్నివీరులుగా నియమకాలు చేపట్టే విభాగాలు, అందుకు కావాల్సిన అర్హతలను ఆర్మీ ఈ తాజా నోటిఫికేషన్లో పేర్కొంది. అంతేకాకుండా అగ్ని వీరులకు ఇచ్చే ప్యాకేజీ, సెలవులు, సర్వీసు నిబంధనలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ నోటిఫికేషన్లో వుంది.

Related Posts

Latest News Updates