స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి హైడ్రోజన్ ట్రైన్ ఈ యేడాది చివరి కల్లా పట్టాలెక్కుతుంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. వందే మెట్రో పేరుతో హర్యానాలోని కల్కా- హిమాచల్ ప్రదేధశ్ లోని షిమ్లా రూట్ లో నడుస్తుంది. రైల్వేలో పూర్తిగా గ్రీన్ టెక్నాలజీని వినియోగంలోకి తెచ్చే దిశగా ఈ హైడ్రోజన్ రైల్వే ద్వారా తొలి అడుగుపడుతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తొలి దశలో న్యారోగేజ్ రైల్వే లైన్లపై మాత్రమే హైడ్రోజన్ ట్రైన్స్ నడుపుతామని స్పష్టం చేశారు.
వందేభారత్ ట్రైన్ ను దేశ ప్రజలు వరల్డ్ క్లాస్ ట్రైన్ గా భావించి, సంతోషంగా జర్నీ చేస్తున్నారని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ప్రస్తుతం చెన్నై లో వందేభారత్ ట్రైన్ కోచ్ లు తయారవుతున్నాయని, త్వరలో రాయ్ బరేలీలో కూడా తయారీ ప్రాసెస్‌ను స్టార్ట్ చేస్తామన్నారు. వచ్చే ఏడాది మార్చికల్లా ప్రతి వారం రెండు, మూడు వందే భారత్ ట్రైన్లను ప్రారంభిస్తామన్నారు. ఉద్యోగస్థులు, విద్యార్థులు, పర్యాటకులు ఇవి చాలా వెసులుబాటుగా వుంటాయని వివరించారు.
వందే భారత్ తరహాలోనే వందే మెట్రోలను కూడా తెస్తున్నామని, పెద్ద నగరాల చుట్టుపక్కల 50 కిలోమీటర్ల దూరంలో వున్న వారు పనికోసం నగరానికి వచ్చి, మళ్లీ తమ స్వస్థలాలకు చేరుకునేలా వందే భారత్ మెట్రోని తేవాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. వందే మెట్రో రూపకల్పన, తయారీ ఈ యేడాదే పూర్తవుతుందని పేర్కొన్నారు. వందే మెట్రో రైలు 1950 మరియు 1960 లలో రూపొందించిన అనేక రైళ్ల స్థానంలో ప్రవేశపెట్టనున్నారు.
దీనిలోని ఇంజిన్ పూర్తిగా హైడ్రోజన్ ఆధారితంగా ఉంటుంది. దీని వల్ల కాలుష్య ఉదార్గాలు ఏమీ ఉండవు. వందే భారత్ రైలు మాదిరిగానే ఈ రైలులో కూడా ఆధునిక బ్రేక్ సిస్టమ్, రెడ్ సిగ్నల్ బ్రేకింగ్ నిరోధించడానికి కవాచ్ సేఫ్టీ సిస్టమ్, ఆటోమేటిక్ డోర్, ఫైర్ సెన్సార్, జీపీఎస్, ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయనున్నారు. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఛార్జీలు అందుబాటులో ఉండేలా దీనిని తీసుకురానున్నారు.