ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ప్రారంభమై యేడాది కావొస్తోంది. దీనిని ముగించాలని దాదాపుగా అన్ని దేశాలూ పిలుపునిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ యుద్ధంపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. యుద్ధం ఆపేయాలని పుతిన్ ని భారత ప్రధాని మోదీ అడిగితే… కచ్చితంగా పుతిన్ వెనక్కి తగ్గుతారన్న నమ్మకం తమకుందని వైట్ హౌజ్ ప్రతినిధి జాన్ కెర్బీ పేర్కొన్నారు. యుద్ధాన్ని ఆపడానికి పుతిన్ కు ఇప్పటికీ సమయం వుందని భావిస్తున్నానని అన్నారు. అందుకు ఇంకా సమయం వుందని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. భారత ప్రధాని మోదీ పుతిన్ కి నచ్చచెప్పగలరు. ఎలాంటి చర్యలు చేపట్టాలని అనుకుంటున్నారో మోదీ చెప్పాలి. ఉక్రెయిన్ లో యుద్ధానికి తెరపడడానికి దారితీసే ఎలాంటి కృషినైనా అమెరికా స్వాగతిస్తుంది. యుద్ధం ఈరోజే ఆగిపోతుందని అనుకుంటున్నాం. ఈ రోజే ఆగిపోవాలి’’ అని జాన్ కిర్బీ అన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీలతో ప్రధాని మోదీ పలుమార్లు మాట్లాడారు. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా పుతిన్‌తో ప్రధాని మోదీ మాట్లాడుతూ “నేటి యుగం కాదని నాకు తెలుసు. ప్రజాస్వామ్యం, దౌత్యం, చర్చలు మొత్తం ప్రపంచాన్ని కదిలిస్తాయని మేము మీతో చాలాసార్లు ఫోన్‌లో చర్చించాను” అని అన్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య హింసను తక్షణమే నిలిపివేయాలని మోదీ ఇచ్చిన పిలుపును అమెరికా స్వాగతించింది.