అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ ఇ కన్వెన్షన్ సెంటర్‌లో అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) 17వ మహాసభలు 2వ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వైజాగ్ ఎంపి ఎంవివి సత్యనారాయణ ముఖ్య అతిధులుగా మహాసభలు ప్రారంభమయ్యాయి.
ఆట వేడుకలలో భాగంగా రెండో రోజు మధ్యాహ్నం సిలికానాంధ్ర మనబడి విద్యార్ధులు ప్రదర్శించిన శ్రీకృష్ణ రాయబారం నాటకం ప్రేక్షకులను అలరించింది. ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ గత రెండు వారాల నుండి విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. శ్రీకృష్ణరాయబారం నాటకంన్ని విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శించారు. గుమ్మడి గోపాలకృష్ణతో పాటు సిలికానాంధ్ర చైర్మన్ కూచిభొట్ల ఆనంద్, ప్రొఫెసర్ మూల్పూరి వెంకట్రావు తదితరులు విద్యార్థులను అభినందించారు.