జూలై 1 వ తేదీ నుంచి 3 రోజుల పాటు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఆటా మహా సభలు జరగనున్నాయి. ఈ సభలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రముఖలుందర్నీ పిలుస్తున్నామని అమెరికన్ తెలుగు అసోసియేషన్ బాధ్యులు ప్రకటించారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఉత్సవాల ముగింపు రోజున ఇళయ రాజా సంగీత విభావరి కూడా వుంటుందని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన కళాకారులు, రాజకీయ నేతలు, సినీ నటులు హాజరవుతున్నారు. ఇక ఇప్పటికే ప్రతినిధులు వార్ రూమ్ లను ఏర్పాటు చేసుకున్నారు. గతానికి భిన్నంగా కొత్త కొత్త కళారీతులతో ప్రజల ముందుకు రానున్నారు. ఆటా కల్చరల్ కమిటీ, హాస్పిటాలిటీ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు.
ఈ ఉత్సవాలకు టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా హాజరు కానున్నారు. ఆట సభల్లో జరిగే యూత్ కన్వెన్షన్ లో ఆమె పాల్గొనాలని ప్రతినిధులు ఆహ్వానించారు. ఇందుకు కవిత అంగీకారం తెలిపారు. తెలంగాణ పెవిలియన్ ను ఆమె ప్రారంభించనున్నారు. అలాగే దాదాపు 10 వేల మంది హాజరయ్యే ఆటా ప్రైమ్ మీట్ కు కవిత ప్రత్యేక అతిథిగా హాజరువుతారు.