ఏపీలోని సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోపై హైటెన్షన్ వైర్ విద్యుత్ తీగ అకస్మాత్తుగా తెగిపడింది. దీంతో 8 మంది కూలీలు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. ఈ సమయంలో మొత్తం ఆటోలో 11 మంది ప్రయాణిస్తున్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తాడిమర్రి మండలం పెద్దకోట్ల పంచాయతీ గ్రామానికి చెందిన 11 మంది కూలీలు పనుల నిమిత్తం కునుకుంట్ల గ్రామానికి బయలుదేరారు.
వీరు ప్రయాణిస్తున్న ఆటపై మార్గమధ్యలో అకస్మాత్తుగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆటో బుగ్గి బుగ్గి అయిపోయింది. మరణించిన వారు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం కూడా కష్టమైంది. ప్రమాదం విషయం తెలియడంతో పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.