అమెరికాలో 2013 తర్వాత మళ్లీ పోలియో వైరస్ వెలుగు వెలుగుచూసింది. న్యూయార్క్లోని ఓ వ్యక్తిలో పోలియోను గుర్తించినట్లు అమెరికా వైద్యాధికారులు వెల్లడిరచారు. అతడు పోలియో వ్యాక్సినేషన్ వేయించుకోలేదన్నారు. నోటీ ద్వారా వేసే పోలియో చుక్కల టీకాలో ఉండే బలహీన వైరస్ నుంచి అతడికి పోలియో సోకినట్లు తమ అధ్యయనంలో తేలిందని అమెరికా పరిశోధకులు తెలిపారు. ఈ తరహా వ్యాక్సిన్ను అమెరికాలో 200 నుంచి నిలిపివేయడం గమనార్హం. ప్రస్తుతం ఇంజక్షన్ ద్వారా ఇచ్చే పోలియో టీకాను మాత్రమే అమెరికా కొనసాగిస్తోంది. దీనిలో మృత వైరస్ ఉంటుంది. చుక్కల టీకాలో అత్యంత బలహీనమైన పోలియో వైరస్ ఉంటుంది. తద్వారా రోగనిరోధక శక్తికి పోలియో వైరస్ గురించి తెలిసేలా భవిష్యత్తులో వస్తే దానిపై పోరాడేలా ఈ టీకా పనిచేస్తుంది. 20వ శతాబ్దం వరకూ తీవ్ర స్థాయిలో విస్తరించిన పోలియో మహమ్మారి, తర్వాతి కాలంలో టీకాల రాకతో అంతరించే దశకు చేరింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 13 కేసులు మాత్రమే వెలుగుచూశాయి.
