అధికార టీఆర్ ఎస్ పార్టీకి షాక్ తగిలింది.బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి టీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసేశారు. రాజీనామా పత్రాన్ని రంగారెడ్డి జిల్లా టీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడికి పంపారు. అనివార్య, వ్యక్తిగత కారణాల రీత్యానే రాజీనామా చేస్తున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. సరిగ్గా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముందు బీజేపీ కార్పొరేటర్లను మంత్రి కేటీఆర్ టీఆర్ ఎస్ లో చేర్చుకున్నారు. ఇప్పుడు.. టీఆర్ ఎస్ కే ఝలక్ తగిలింది.
బడంగపేట్ అభివృద్ధి కాంక్షించిచ తాను అప్పట్లో టీఆర్ఎస్ లో చేరానని పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. అప్పటి నుంచి పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పని చేశానని చెప్పుకొచ్చారు. తాము అంత క్రమశిక్షణతో వుంటే పార్టీ కొంత కాలంగా తమపై వ్యతిరేక భావనతో వుంటోందని ఆరోపించారు. అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు బడంగపేట్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దల సమక్షంలో ఆమె సోమవారం కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.