దిల్ రాజు ప్రొడక్షన్స్ లో త్వరలో రిలీజ్ కాబోతున్న చిత్రం ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే చిత్ర బృందం ప్రమోషన్స్ షురూ చేసింది. ఇందులో భాగంగా యాత్రలు చేస్తున్నారు. సినిమా యూనిట్ దిల్ రాజుతో కలిసి నిజామాబాద్ లో సందడి చేశారు.బలగం సినిమా యూనిట్ మొత్తం ఒక బలగంగా వెళ్లి.. దిల్ రాజు సొంత గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నారు. ఆనంతరం గ్రామ ప్రేక్షకులతో కలిసి టాక్టర్ లో ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో దిల్ రాజు, అతని సతీమణి తేజస్విని, వేణు, ప్రియ దర్శి, హీరోయిన్ కావ్య పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవి వైరల్ అయ్యాయి.
జబర్దస్త్ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ ‘వేణు’ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న మొదటి చిత్రం ఈ బలగం. కాగా ఈ సినిమాలో హీరోగా ప్రియ దర్శి నటిస్తున్నాడు. అల్లు అర్జున్ గంగోత్రి సినిమాలో నటించిన ‘బేబీ కావ్య’ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ఇప్పటికే మొదలు పెట్టిన మూవీ టీం.. వరుస పెట్టి సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.