నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన తాజా చిత్రం బింబిసార. కల్యాణ్‌రామ్‌కు జోడీగా కేథరీన్ ట్రెసా, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఆగస్టు 5న విడులైన ఈ చిత్రం మొదటి షో నుండి పాజిటివ్ టాక్‌ను తెచ్చుకొని వసూళ్ళ సునామీని సృష్టిస్తుంది. మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు చిత్రాన్ని వీక్షించి బింబిసార బృందాన్ని అభినందిస్తున్నారు. తాజాగా బాలకృష్ణ బింబిసార చిత్రాన్ని వీక్షించాడు. బాలకృష్ణ, కళ్యాణ్ రామ్‌తో కలిసి డైరెక్టర్ వశిష్ట, టీం బాలయ్యతో సినిమా చూశారు. బాలయ్య కల్యాణ్ రామ్‌తో పాటు బింబిసార టీంకు అభినందనలు తెలిపారు. బాలకృష్ణతో పాటు కళ్యాణ్‌రామ్ సోదరి సుహాసిని, భార్య స్వాతి కూడా బింబిసార చిత్రాన్ని చూశారు. ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
