మాజీ మంత్రి, వైఎస్ జగన్ కుటుంబానికి బంధువైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలోకి వెళ్తున్నట్లు వచ్చిన వార్తలతో ఒక్కసారిగా అలజడి రేగింది. ఆయన ఇప్పటికే జనసేనతో టచ్ లోకి వెళ్లారని, అతి త్వరలోనే వైసీపీని వీడుతున్నారని వార్తలొచ్చాయి. దీంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. తాను జీవితాంతం వైసీపీతోనే వుంటానని స్పష్టం చేశారు. తాను జనసేనలోకి వెళ్లడం లేదని, అదంతా దుష్ప్రచారమని కొట్టిపారేశారు. తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చేనేతల విషయంలో జనసేన అధినేత పవన్ ట్వీట్ బాగుందని, అందుకే తాను ట్యాగ్ చేశానని, దానిని కూడా రాజకీయం చేస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. ఇదే విషయంపై కేటీఆర్ కూడా ట్వీట్ చేశారని, తనది మాత్రమే కొందరు హైలెట్ చేస్తున్నారని బాలినేని మండిపడ్డారు.
