బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేడు తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. కవితపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు బండి సంజయ్ వివరణ ఇచ్చారు. ఎమ్మెల్సీ కవిత విషయంలో తాను ఏ తప్పూ మాట్లాడలేదని బండి సంజయ్ మహిళా కమిషన్ ముందు తన వాదనలు వినిపించారు. సంజయ్‌ను మహిళా కమిషన్ దాదాపు మూడు గంటల పాటు విచారించింది.తెలంగాణలో ఓ సామెతను మాత్రమే తాను వాడనని పేర్కొన్నారు. తాను ఎవ్వర్నీ కించపరచలేదని స్పష్టం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నట్లు రెండు పేజీల్లో వివరణ ఇచ్చారు.
కవితపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు బండి సంజయ్ వివరణ ఇచ్చారు. బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులతో కలిసి ఆయన కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. ఉదయం 11 గంటల కల్లా కమిషన్ ముందు హాజరయ్యారు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కమిషన్ సుమోటోగా స్వీకరించింది. దీంతో ఆయనకు నోటీసులిచ్చింది.
ఈ నెల 15 న తమ ముందు విచారణకు హాజరు కావాలని బండిని ఆదేశించింది. అయితే… పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తాను హాజరు కాలేనని, 18 న విచారణకు హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు. హామీ ఇచ్చినట్లుగానే బండి సంజయ్ నేడు మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరై, తన వివరణ ఇచ్చారు. మహిళా కమిషన్ కు వచ్చిన బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది.
కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహిళా కమిషన్ ఆఫీసు ఎదుట నిరసనకు దిగింది. ఎమ్మెల్సీ కవితకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.