తెలంగాణలో రేషన్ కార్డుల రద్దు, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంపై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. రద్దు చేసిన కార్డులు, కొత్తగా మంజూరు చేసిన కార్డులకు విధించిన నిబంధనలపై పూర్తి దర్యాప్తు జరపాలని బండి సంజయ్ మానవ హక్కుల సంఘాన్ని కోరారు. అర్హులైన వారందరికీ తెలంగాణ సర్కార్ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసే విధంగా చూడాలని అభ్యర్థించారు.
కొత్త రేషన్ కార్డుల మంజూరుపై సర్కార్ విధించిన నిషేధాన్ని వెంటనే తొలగిచేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని బండి సంజయ్ మానవ హక్కుల కమిషన్ ను కోరారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 19 లక్షల రేషన్ కార్డులను రద్దు చేసిందని, ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి 7 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో వున్నాయని బండి సంజయ్ మానవ హక్కుల కమిషన్ కు నివేదించారు.