Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

పాదయాత్ర కాదు.. బస్సు యాత్ర… రాష్ట్రంలో బీజేపీ కొత్త ప్లాన్

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టేందుకు కసరత్తు ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. అయితే.. సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్లే అవకాశాలున్నాయని బీజేపీ బలంగా విశ్వసిస్తోంది. అదే గనక నిజమైతే… పాదయాత్ర చేస్తూ పోతే… రాష్ట్ర పర్యటన చాలా ఆలస్యమవుతోందని బీజేపీ పేర్కొంటోంది. అందుకే బస్సు యాత్ర ద్వారా ఎక్కువ జిల్లాలను కవర్ చేయవచ్చని బలంగా భావిస్తోంది.

 

అందుకే బండి సంజయ్ బస్సు యాత్రకు సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే పాదయాత్ర సమయంలో కొంచెం ఖాళీ సమయం దొరికితే.. వెంటనే జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. పార్టీ పటిష్ఠతపై బండి సంజయ్ స్థానిక నేతలతో చర్చిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పరిస్థితి, పోలింగ్ బూత్ కమిటీల ఏర్పాటు, పార్టీ బలోపేతం కోసం కార్యక్రమాలపై మార్గదర్శనం చేస్తున్నారు. తాజాగా బండి సంజయ్ ముథోల్, నిర్మల్ కేడర్ తో సమీక్ష నిర్వహించారు.

Related Posts

Latest News Updates