తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట నుంచి ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. ఆగస్టు 2 న యాద్రాది నరసింహ స్వామికి పూజలు చేసి, బండి సంజయ్ యాత్ర ప్రారంభిస్తారు. ముందుగా భువనగిరి లోకసభ పరిధిలోని యాదగిరి గుట్టలో మొదలై, హన్మకొండ భద్రకాళి వద్ద ముగుస్తుంది. ఇబ్రహీం పట్నం తప్పించి, ఆలేరు, భువనిగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, జనగాం అసెంబ్లీ పరిధిలోని ప్రాంతాల గుండా సాగుతుంది.
ఇక.. వరంగల్ లోకసభ పరిధిలోని స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, పరకాల, వంగల్ తూర్పు, పశ్చిమ, హన్మకొండ నియోవజకవర్గాల్లో కొనసాగుతుంది. రోజుకు 15 కిలోమీటర్ల చొప్పున 20 రోజుల పాటు 300 కిలోమీటర్ల మేర సాగుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. హన్మకొండ భద్రకాళి అమ్మవారి గుడి దగ్గర ఆగస్టు 21 న ప్రజా సంగ్రామ యాత్ర ముగుస్తుంది. ఈ సందర్భంగా వరంగల్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. అయితే.. రూట్ మ్యాప్ పక్కాగా మాత్రం సిద్ధం కాలేదు.