తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహార శైలిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రెండు రోజుల పాటు ప్రధాని మోదీ హైదరాబాద్ లోనే వుంటున్నారని, మరి ఊర్లనే వుంటవా? ఊర్లు పట్టుకొని తిరుగుతావా? అంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి బండి సంజయ్ ఘాటు ట్వీట్ చేశారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ కు వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ప్రభుత్వం తరపున స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లడం లేదు. సీఎం కేసీఆర్ కు బదులుగా మంత్రి తలసాని ఆ బాధ్యతలను మోస్తున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ సీఎం కేసీఆర్ ను దెప్పిపొడుస్తూ ట్వీట్ చేశారు.
ఫిబ్రవరిలో మోడీగారు నగరానికొస్తే జ్వరమని ఫార్మ్ హౌస్ల పన్నవ్
మొన్న హైదరాబాద్ వస్తే పక్కరాష్ట్రానికి జారుకున్నవ్
ఈసారి 2రోజులు ఇక్కడనే ఉంటున్నాడు మోడీగారు.
ఊర్లనే ఉంటవా ? ఊర్లు పట్టుకొని తిరుగుతవా దొరా?
నీ మేకపోతుగాంభీర్యాలు బరాబర్ బయటపెడతము.#SaaluDoraSelavuDora— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 2, 2022