బాసర త్రిపుల్ ఐటీలో మళ్లీ విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు. రాత్రి 3 గంటలకు మెస్ లో జాగారం చేశారు. ఉదయం నుంచే ఆందోళన నిర్వహిస్తున్నారు. తాము లేవనెత్తిన డిమాండ్లపై వెంటనే వీసీ క్లారిటీ ఇవ్వాలని, అప్పుడే వీసీతో చర్చలకు సిద్ధమని తేల్చి చెబుతున్నారు. ఫుడ్ పాయిజన్ వివాదం రేగిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ఇంజనీరింగ్ మొదటి, ద్వితీయ సంవత్సరం చదివే 3 వేల మంది విద్యార్థులు డైనింగ్ హాల్‌లోనే బైఠాయించారు. హాస్టళ్లలో భోజనం మెరుగుపడలేదని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనకు దిగినట్లు విద్యార్థులు తెలిపారు. ప్రతిరోజూ వర్సిటీ అధికారులు, అధ్యాపకులు విద్యార్థులతో ఏర్పాటు చేసిన కమిటీ ప్రతిరోజు మెస్ లో భోజన వసతిని పరిశీలిస్తున్నప్పటికీ ఎలాంటి మార్పు లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.