Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

చైనాతో జాగ్రత్త.. నిక్కీ హేలీ హెచ్చరిక

అమెరికా ఇప్పటివరకు ఎదుర్కొన్న దేశాలతో పోలిస్తే చైనా అత్యంత బలమైన, క్రమశిక్షణ కలిగిన శత్రువని అధ్యక్ష రేసులో ఉన్న నిక్కీ హేలీ వ్యాఖ్యానించారు. రిపబ్లికన్ పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ నిక్కీ హేలీ చైనా గురించి ఈ హెచ్చరికలు చేశారు. అమెరికా గగనతలంలోకి ఓ చైనా నిఘా బెలూన్ వస్తుందని నేను ఎన్నడూ అనుకోలేదు. ఇది మనకెంతో అవమానం  అని అంటూ బైడెన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  బైడెన్ ప్రభుత్వం చైనా విషయంలో వ్యవహరిస్తున్న తీరును నేను నమ్మలేకపోతున్నా. మన దేశంలో చైనా సంస్థలు 3,80,000 ఎకరాల భూమిని సొంతం చేసుకున్నాయి. వీటిలో కొన్ని మన మిలిటరీ బేస్లకు దగ్గరగా ఉన్నాయి. ఒక శత్రుదేశం మన దగ్గర భూమిని కొనుగోలు చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించకూడదు అని అన్నారు. అమెరికా పని అయిపోయిందని చైనా భావిస్తోందని, ఈ విషయంలో అది పొరబడుతోందని చెప్పారు. తన దేశాన్ని మళ్లీ తీర్చిదిద్దేందుకే తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు హేలీ చెప్పారు. యువతరం కోసం ఓటు వేయాలని ఆమె తోటి రిపబ్లికన్లకు విజ్ఞప్తి చేశారు. ఒక పార్టీగానే కాకుండా ఒక దేశంగా విజయం సాధించాలనుకుంటే తనకు అండగా నిలబడాలని ఆమె కోరారు.

Related Posts

Latest News Updates