బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హైదరాబాద్ లోని మెట్రో స్టేషన్ దగ్గర హఠాత్తుగా కనిపించారు. సాధారణ ప్రయాణికుడు ఉన్నట్లే సాధారణంగా నిలబడి వుండటం కనిపించింది. హైదరాబాద్ హైటెక్ సిటీలోని రాయదుర్గం మెట్రో స్టేషన్ దగ్గర అమితాబ్ తళుక్కుమన్నారు. దీంతో అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. తమ తమ ఫోన్లనో అమితాబ్ ను బంధించుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అమితాబ్ తాజా సినామా ప్రాజెక్టు కె షూటింగ్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జరిగింది. ప్రభాస్ హీరోగా, దీపికా పదుకొణె హీరోయిన్. నాగ్ అశ్విన్ డైరెక్టర్ గా వున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ రాయదుర్గం మెట్రో స్టేషన్లో తీశారు. అందులో అమితాబ్ నటించారు.