ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్రను బిహార్ పోలీసులు భగ్నం చేశారు. పాట్నా వేదికగా ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నిన ఇద్దరు అనుమానితులను ఉగ్రవాదులు అరెస్ట్ చేశారు. మహ్మద్ జల్లావుద్దీన్, అథర్ పర్వేజ్ గా గుర్తించామని పోలీసులు ప్రకటించారు. వీరికి పీఎఫ్ఐతో లింకులు కూడా వున్నాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ బిహార్ పర్యటన సందర్భంగా ఆయన్ను లక్ష్యంగా చేసుకొని, ఉగ్రవాదులు కుట్రలు పన్నారని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా 6,7 తేదీల్లో మోదీ హత్యకు కుట్ర పన్నేందుకు రహస్య సమావేశాలు కూడా వీరు నిర్వహించుకున్నారు.
అంతేకాకుండా 2047 నాటికి భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు కూడా గుర్తించారు. ఈ అనుమానిత ఉగ్రవాదులు ప్రధాని మోదీ పర్యటనకు సరిగ్గా 15 రోజుల ముందు పుల్వారీ షరీఫ్ లో శిక్షణ పొందినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో బిహార్ పోలీసులు పుల్వారీ షరీఫ్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. పీఎఫ్ఐకి చెందిన 15 కరపత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.