అటల్ బిహారీ వాజ్ పాయ్.. భారత రాజకీయాల్లో ఓ సంచలనం. తన రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా మంత్ర ముగ్ధుల్ని చేసిన ఓ రాజకీయ వేత్త. ఇప్పుడు ఆ మహోన్నతుడి కథ సినిమా రూపంలో వస్తోంది. వాజ్ పాయ్ జీవితం ఆధారంగానే ఓ సినిమా రెడీ అవుతోంది. ఉల్లేక్ ఎన్ పీ రాసిన ది అన్ టోల్డ్ వాజ్ పేయ్… పొలిటీషియన్ అండ్ పారాడాక్స్ అన్న పుస్తకం ఆధారంగా అటల్ జీ చిత్రం రూపొందించబడుతోంది. వినోద్ భన్సాలీ, సందీప్ సింగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2023 క్రిస్మస్ నాటికి వాజ్ పాయ్ 99 వ జన్మదినం. ఆ రోజు రిలీజ్ చేయనున్నారు.
మరో వైపు ప్రొడ్యూసర్ సందీప్ సింగ్ దీనికి సంబంధించిన దానిని ఇన్ స్టాలో కూడా పోస్ట్ చేశారు. భారత రాజకీయ చరిత్రలో వాజ్ పాయ్ ఓ మహోన్నతుడని, మాటల ద్వారా శత్రువుల మనసులను కూడా గెలుచుకున్నారని చెప్పుకొచ్చారు.
FILM ON ATAL BIHARI VAJPAYEE ANNOUNCED: VINOD BHANUSHALI – SANDEEP SINGH TO PRODUCE… #VinodBhanushali and #SandeepSingh join hands to make a film on the epic life story of Shri #AtalBihariVajpayee ji… Titled #MainRahoonYaNaRahoonYehDeshRehnaChahiye – #Atal. pic.twitter.com/LC82GZw3FJ
— taran adarsh (@taran_adarsh) June 28, 2022