Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

ఏపీ, తెలంగాణలో త్వరలో జరుగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల స్థానానికి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, కడప- అనంతపురం- కర్నూలు స్థానానికి నగరూరు రాఘవేంద్ర, శ్రీకాకుళం- విజయనగరం- విశాఖ పట్నానికి పీవీఎన్ మాధవ్ ను ప్రకటించింది. ఇక… తెలంగాణలోని హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ ఉపాధ్యాయ స్థానానికి వెంకట నారాయణరెడ్డి పేరును ఖరారు చేసింది. మిగిలిన స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి వుంది.

 

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఈమేరకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల స్థానాల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక.. తెలంగాణలో ఒక ఉపాధ్యాయ, ఒక స్థానిక సంస్థల స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ కోటాలో ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న సభ్యుల పదవీ కాలం మార్చి 29 తో ముగిసిపోనుంది. ఏపీలోని ప్రకాశం-నెల్లూరు- చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు, శ్రీకాకుళం- విజయనగరం- విశాఖ పట్టభద్రుల స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

 

దీంతో పాటు ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ స్థానాల్లో ఈసీ ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా కడప, నెల్లూరు. తూర్పు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. ఇక… తెలంగాణలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఉపాధ్యాయ స్థానంతో పాటు హైదాబాద్ స్థానిక సంస్థల స్థానంలో ఎన్నికలు జరగనున్నాయి.

Related Posts

Latest News Updates