తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ జ్వరం పట్టుకుందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ఆయనకు పట్టింది ఎలక్షన్ ఫీవర్ కాదని, బీజేపీ ఫీవర్ అంటూ ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లాలో ప్రజాగోస- బీజేపీ భరోసా కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా భారీ బైక్ ర్యాలీ తీశారు. రైతులకు సీఎం కేసీఆర్ రుణమాఫీ చేయడం లేదని, తెలంగాణ సంపదను మాత్రం దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రజా సమస్యల కోసమే ప్రజాగోస బీజేపీ భరోసా అన్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు. అయితే.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తోందంటూ ఫైర్ అయ్యారు.
తెలంగాణ ప్రజల బాధలు పోవాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని బీజేపీ చీఫ్ నొక్కి చెప్పారు. ఉద్యోగులకు ఠంఛన్ గా జీతాలు రావాలన్నా… డెవలప్ మెంట్ జరగాలన్నా… తమతోనే సాధ్యమనిఅన్నారు. 30 వేల కోట్ల ప్రాజెక్టును లక్సా 30 వేల కోట్ల రూపాయలకు పెంచి, ప్రజలు సొమ్మును సీఎం కేసీఆర్ దోచుకున్నారని, సీఎం కేసీఆర్ కు కూడా ఈడీ విచారణ తప్పదని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.