గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు పెట్టారు అధికారులు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ఆ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. గుజరాత్ లో 182, హిమాచల్ లో 68 సీట్లలో ఇటీవల ఎన్నికలు జరిగాయి. గుజరాత్ లో ప్రభుత్వ ఏర్పాటుకు 92 సీట్లు, హిమాచల్ లో 35 సీట్లు అవసరం.
ఇక… గుజరాత్ లో కమలం దూసుకుపోతోంది. ప్రభుత్వ ఏర్పాటు దిశగా కమలం అడుగులు వేస్తోంది. వరుసగా ఏడోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు రెడీ అవుతోంది. గుజరాత్ లో ఇప్పటి వరకూ బీజేపీ 117 స్థానాల్లో, కాంగ్రెస్ 46 స్థానాల్లో, ఆప్ 5 స్థానాల్లో లీడ్ లో వున్నాయి.
ఇక.. హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే.. కాంగ్రెస్ 32 స్థానాల్లో ముందంజలో వుంది. బీజేపీ 33 స్థానాల్లో లీడ్ లో వుంది. ఇక్కడ ఆప్ కనీసం ఖాతా కూడా ఇప్పటి వరకు తెరవలేదు. హిమాచల్ ప్రదేశ్ లో క్షణక్షణానికీ ఫలితాలు మారిపోతున్నాయి. కాసేపు కాంగ్రెస్ లీడ్ లో వుంటే.. మరో వైపు బీజేపీ లీడ్ లో కనిపిస్తోంది.