ఎనిమిదేళ్ల పాలన వేదికగా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పాలనపై బీజేపీ సిద్ధంగా వుందని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జీ తరుణ్ ఛుగ్ సవాల్ విసిరారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలనూ టీఆర్ ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. దళితులకు మూడు ఎకరాలు, కేజీ టూ పీజీ ఉచిత విద్య అని ప్రకటించారని, అది ఏమైందని సూటిగా నిలదీశారు.
కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బైబై చెప్పేసే టైం వచ్చిందన్నారు. కేసీఆర్ సర్కార్ జంతర్ మంతర్ సర్కార్ అంటూ ఛుగ్ ఎద్దేవా చేశారు. రెండు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం తగ్గించిందని, అయినా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో తగ్గించలేదని మండిపడ్డారు. ఈ రోజు నుంచే కేసీఆర్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ షురు అయ్యిందని తరుణ్ ఛుగ్ అన్నారు.