బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కి తెలంగాణ ప్రభుత్వం మరొక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. 2017 మోడల్ ఫార్చ్యూనర్ కారును రాజసింగ్ ఇంటికి పంపింది.గతంలో ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మొరాయిస్తుండటంతో ఆయన పలుమార్లు ఆ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, హోం మంత్రి, డీజీపీ దృష్టికి తెచ్చారు. అయినా స్పందన లేకపోవడంతో ఇటీవలే పాత వాహనాన్ని ప్రగతి భవన్ వద్ద వదిలి పెట్టి వచ్చారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్కు ప్రభుత్వం మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇచ్చింది. రాజాసింగ్ పర్యటనలకు వెళితే.. పాత బుల్లెట్ కారు రోడ్డుపైనే మొరాయించేది. దీనిపై రాజాసింగ్ పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. చివరికి తెలంగాణ ప్రభుత్వం మరో బుల్లెట్ ప్రూఫ్ ని పంపింది. అయితే… ప్రస్తుతం తాను సిటీలో లేనని, ఇంటికి వచ్చిన తర్వాత… దాని కండీషన్ చూసి చెబుతానని రాజాసింగ్ పేర్కొన్నారు.