తనకు తరుచుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డీజీపీ అంజనీ కుమార్ కి లేఖ రాశారు. పాకిస్తాన్ నుంచి తరుచుగా తనను చంపేస్తానంటూ ఫోన్లో బెదిరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తనకు 8 నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని, అయినా FIR నమోదు చేయాలేదన్నారు. తనకు ప్రాణహాని ఉందని లైసెన్స్ గన్ ఇవ్వాలని డీజీపీని కోరారు. రక్షణ కోసం పదేపదే కోరుతున్నా స్పందించడం లేదని, +923105017464 నెంబర్ ద్వారా బెదిరింపు కాల్స్ వచ్చినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ లో వున్న యాక్టివ్ స్లీపర్ సెల్ ద్వారా చంపేస్తామంటూ ఫోన్లో బెదిరిస్తున్నారని రాజాసింగ్ డీజీపికి ఫిర్యాదు చేశారు.
