సీఎం కేసీఆర్ పై పోటీ చేసే విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధిష్ఠానం ఆదేశిస్తే… కేసీఆర్ పై పోటీ చేసేందుకు సిద్దంగా వున్నానని ఈటల ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి ఖాయమని అన్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ఏ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ చేరినా… తాము ఆహ్వానిస్తామని ప్రకటించారు. హుజూరాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పే రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో రిపీట్ అవుతుందని ఈటల రాజేందర్ అన్నారు.
