ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణ రాజకీయాలను తాకింది. ఢిల్లీ లిక్కం స్కాంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ వ్యక్తుల ప్రమేయం కూడా వుందని బీజేపీ ఎంపీ పర్వేశ సాహిబ్ సింగ్ సంచలన ఆరోపణలకు దిగారు. ఒబెరాయ్ హోటల్ లో లిక్కర్ స్కాం డీల్ కుదిరిందని పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన ఓ లిక్కర్ మాఫియా నేత ఏర్పాటు చేసిన ప్రైవేటు విమానంలో ఢిల్లీకి వచ్చిన కేసీఆర్ కుటుంబ సభ్యులు.. మొదటి ఇన్ స్టాల్మెంట్ కింద రూ.150 కోట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఇచ్చారని MP పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఆరోపించారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో కలిసి ఒబెరాయ్ హోటల్ లోనే పాలసీని రూపొందించారన్నారు. ఇదే మద్యం పాలసీ తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాలలోనూ అమలవుతోందని తెలిపారు. సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులతో మీటింగ్ జరిపారా ? లేదా ? చెప్పాలని మనీశ్ సిసోడియాను ఎంపీ పర్వేశ్ డిమాండ్ చేశారు. మద్యం మాఫియా కమీషన్‌ను 10 శాతం మేర పెంచడానికి చేసుకున్న రూ.150 కోట్ల ఒప్పందంలో తొలి విడత చెల్లింపు మనీశ్ సిసోడియాకు అందిందని బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహెబ్ సింగ్ పేర్కొన్నారు.