అత్యంత కీలకమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డును ఆ పార్టీ ప్రకటించింది. మొత్తం 11 మందితో ఈ బోర్డును పార్టీ ప్రకటించింది. అయితే… తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా వున్న కె. లక్ష్మణ్ కు అందులో చోటు లభించింది. దీంతో లక్ష్మణ్ కు అత్యంత కీలకమైన ప్రమోషన్ లభించిందినట్లైంది. దీని ద్వారా తాము తెలంగాణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పినట్లైంది. ఇక… అత్యంత కీలకమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డులో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, శర్వానంద సోనోవాలా, బీఎస్ యడ్యూరప్ప, కె. లక్ష్మణ్, ఇక్బాల్ లాల్ పుర, సుధా యాదవ్, సత్యానారాయణ జాతియా, బీఎల్ సంతోష్ ను సభ్యులుగా వుంటారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే… ఇన్ని సంవత్సరాల పాటు ఈ బోర్డులో వున్న నితిన్ గడ్కరీ, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు చోటు లభించలేదు.
ఇక… బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో కూడా కీలక మార్పులు చేసింది. ఈ కమిటీలోకి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు చోటు లభించింది. ఈ కమిటీలో జేపీ నడ్డా, నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, యడియూరప్ప, సర్బానంద సోనోవాలా, కె. లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్ పూరా, సుధా యాదవ్, సత్యనారాయణ జటియా, భూపేంద్ర యాదవ్, ఫడ్నవీస్ ఓం మాథుర్, బీఎల్ సంతోశ్, వనతి శ్రీనివాస్ కు చోటు లభించింది.