తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు జనగామలోని పామ్నూర్ లో అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ అవినీతి కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హ్యాండ్ వుందంటూ బీజేపీ ఎంపీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో బీజేపీ నేతలు కవిత ఇంటి ముందు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిని నిరసిస్తూ అధ్యక్షుడు బండి సంజయ్ జనగామలో ధర్మదీక్ష చేపట్టాలని నిర్ణయించారు. దీక్షకు కూర్చునే ముందే పోలీసులు బండి సంజయ్ ని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ కార్యకర్తలు పోలీసుల వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించారు.
దీంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.సంజయ్ దీక్షకు దిగనున్న దృష్ట్యా అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. బండి దీక్షకు దిగితే టీఆర్‌ఎస్ శ్రేణులు..ఆందోళన చేసే అవకాశం ఉందని పోలీసుల వెల్లడించారు. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే అరెస్ట్ చేశామని పోలీసులు వివరణ ఇచ్చారు. కాగా బీజేపీ కార్యకర్తల అరెస్ట్ పై దుమారం కొనసాగుతోంది. కవిత ఇంటి ముట్టడికి వెళ్లిన బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసు పెడుతారా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపితే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.