తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 21 నుంచి తెలంగాణ అంతటా ద్విచక్ర వాహనాలతో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. బీజేపీ భరోసా యాత్ర పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు. ఏ నియోజకవర్గాల్లో అయితే పార్టీకి అభ్యర్థులు లేరో… అక్కడ వందకు వందశాతం చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు.
అయితే.. ఆ వ్యక్తి బీజేపీ కండువా కప్పుకునే వరకూ ఎక్కడా పేరు మాత్రం బయటికి రావొద్దని బండి సంజయ్ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎలాగైనా ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహించాలని, ముఖ్యంగా టీఆర్ఎస్ నుంచి వలసలను ఎక్కువగా ప్రోత్సహించాలని డిసైడ్ అయ్యారు. ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహించి, సీఎం కేసీఆర్ కు గట్టి షాకివ్వాలని కోర్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు.