Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

దళితుల పట్ల బీజేపీ వైఖరి మరోసారి తేటతెల్లం.. ఎర్రోళ్ల శ్రీనివాస్

ఎస్సీ వర్గీకరణ చేసే ప్రసక్తే లేదంటూ బీజేపీ ఎస్సీమోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్‌సింగ్‌ ఆర్య చేసిన వ్యాఖ్యలను టీఎస్‌ఎంఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఖండించారు. ఈ సందర్భగా శ్రీనివాస్‌  మీడియాతో మాట్లాడతూ బీజేపీ దళితుల వ్యతిరేకి అని మరోసారి తేటతెల్లం అయ్యిందని చెప్పారు. ప్రధాని మోదీ మనుసులోని మాటను ఆయన బయటపెట్టారని తెలిపారు.   దమ్ముంటే నూతనంగా నిర్మించే పార్లమెంట్‌కు అంబేదర్‌ పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు.  దళితులకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకమని మరోసారి స్పష్టమైందని వివరించారు.  ఇప్పటికైనా బీజేపీలో ఉన్న దళితులు ఆలోచన చేయాలని కోరారు. దళితులకు బీజేపీ అన్యాయం చేస్తుంటే, సీఎం కేసీఆర్‌ మాత్రం గౌరవంతో బతికేలా చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 125 అడుగుల అంబేదర్‌ విగ్రహం ఏర్పాటుతోపాటు నూతన సచివాలయానికి అంబేదర్‌ పేరు పెట్టిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. దళితబంధు వంటి గొప్ప కార్యక్రమాలు అమలు చేస్తున్న కేసీఆర్‌ గురించి బీజేపీ నేతలు పిచ్చి కూతలు కూయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Posts

Latest News Updates