బ్యూటీ జాన్వీ కపూర్ తమిళ సినిమాలో నటించనుందన్న వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తనకు దక్షిణాది స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనుందని జాన్వీ చాలా సార్లు చెప్పింది కూడా. దీంతో ఆ వార్త నిజమని చాలా మంది నమ్ముతున్నారు. ఈ పుకార్ల సమయంలో జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ స్పందించాడు. జాన్వీ కపూర్ ప్రస్తుతానికి ఏ తమిళ చిత్రానికి కమిట్ కాలేదని ప్రకటించాడు. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయవద్దని కోరాడు. ‘ప్రియమైన మీడియా మిత్రులారా.. జాన్వీ కపూర్ ప్రస్తుతానికి ఏ తమిళ చిత్రాలకు కమిట్ కాలేదు. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయవద్దని అభ్యర్థిస్తున్నాను. అంటూ ట్వీట్ చేశాడు. టాలీవుడ్ హీరో ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబో తెరకెక్కనున్న ‘ఎన్‌టీఆర్ 30’ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మాత్రం బోనీ, జాన్వీ, ‘ఎన్‌టీఆర్ 30’ చిత్రబృందం కానీ స్పందించలేదు.
