బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రధాని పదవి నుంచి దిగొపోతున్నారు. తన కేబినెట్ సహచరులు వరుసగా రాజీనామాలు చేయడంతో ఆయన ప్రభుత్వం సంకటంలో పడిపోయింది. కొన్ని రోజులుగా ఆయన్ను అనేక సవాళ్లు చుట్టుముడుతున్నాయి. దీంతో ప్రధాని పదవి నుంచి తప్పుకోవడానికి జాన్సన్ సిద్ధమైనట్లు బ్రిటన్ మీడియా పేర్కొంటోంది. తదుపరి ప్రధాని వచ్చే వరకూ బోరిస్ జాన్సన్ ఆపద్ధర్మ ప్రధానిగా వుండనున్నారు. అయితే.. తదుపరి ప్రధాని ఎవరన్నది స్పష్టత రాలేదు. ఇప్పటికే బోరిస్ జాన్సన్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నారు.
ఇటీవల బోరిస్ జాన్సన్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. కరోనా వ్యాప్తి బాగా ఉన్న సమయంలో ఆయన అధికారిక నివాసంలో పెద్ద సంఖ్యలో పార్టీ చేసుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆయనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. కొన్ని రోజులుగా జాన్సన్ పై వ్యతిరేకత పెరుగుతోంది. ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని 40 మందికి పైగా మంత్రులు రాజీనామాలు చేశారు. దీంతో బోరిస్ జాన్సన్ పదవి నుంచి దిగేందుకు సిద్ధమైపోయారు.