యూపీ పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవే సమీపంలోని నారాయణ పూర్ గ్రామ సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిహార్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రెండు ప్రైవేట్ డబుల్ డెక్కర్ బస్సులు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో 8 మంది మరణించారు. 16 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. ఓ బస్సు సడెన్ గా ఆగిపోవడంతో, వెనక నుంచి వచ్చిన మరో బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో గాయపడ్డ వారిని లక్నో ట్రామా సెంటర్ కు తరలించారు. మామూలుగా గాయపడ్డ వారిని దగ్గర్లోని ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించారు. ఇక్కడ వైద్యం అందిస్తున్నారు. మరోవైపు ఈ వార్త తెలియగానే పోలీసులు హుటాహుటిన చేరుకొని, సహాయం చేశారు. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.