హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుల్లు జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో స్కూల్స్ కు వెళ్లే చిన్నారులు కూడా వుండటం విషాదం. కుల్లు జిల్లా జంగ్లా గ్రామ సమీపంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఘటనా స్థలికి ప్రత్యేక రెస్క్యూ టీమ్ చేరుకుంది. రక్షణ చర్యలను చేపట్టింది.
