Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు మోగిన నగారా

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు నగారా మోగింది. సికింద్రాబాద్ సహా దేశంలోని 57 కంటోన్మెంట్ బోర్డుల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర రక్షణ శాఖ పచ్చజెండా ఊపింది.  ఎన్నికల తేదీని ప్రకటిస్తూ రక్షణ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 57 కంటోన్మెంట్ బోర్డులకు ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి తెలిపారు. పార్లమెంటులో నూతన చట్టం అమలు చేసేందుకు ప్రక్రియ మొదలయినప్పటికీ బిల్లు పెండింగ్‌‌లో  ఉండడంతో 2006 చట్టం ప్రకారమే ఎన్నికలు జరిపేందుకు నిర్ణయించారు. రెండేండ్ల క్రితమే కంటోన్మెంట్ పాలక మండలి పదవీ కాలం ముగిసింది. ఏడాదిగా నామినేటెడ్ సభ్యుల ద్వారా పాలన సాగిస్తున్నారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌‌ను  జీహెచ్ఎంసీలో కలపాలన్న విలీన ప్రక్రియ కొనసాగుతుండగానే, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది. దేశంలో ఉన్న కంటోన్మెంట్లలో అతి పెద్దదైన సికింద్రాబాద్ కంటోన్మెంట్‌‌లో  4 లక్షల జనాభా ఉంది. విస్తీర్ణాన్ని బట్టి కంటోన్మెంట్‌‌ను  8 వార్డులుగా నిర్ణయించారు. వీటికి బోర్డు అధికారులు లక్కీ డ్రా ద్వారా రిజర్వేషన్లు నిర్ణయించారు. కంటోన్మెంట్లను  సమీప మున్సిపాలిటీల్లో కలిపే ప్రక్రియకు కేంద్రం గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం సైతం సమ్మతిని తెలుపుతూ సమాధానం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయడంతో మున్సిపాలిటీల్లో కంటోన్మెంట్ విలీన ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారింది.

Related Posts

Latest News Updates