ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అధికార బీజేపీ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్గెన్ అమరీందర్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో అమరీందర్ కొత్త కుంపటి పెట్టుకున్నారు. ఆ తర్వాత ఈ పార్టీని ఆయన బీజేపీలో విలీనం చేసేందుకు అంగీకరించారు కూడా. కెప్టెన్ పేరును ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తుందన్న ఊహాగానాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఈ విషయాన్ని కెప్టెన్ కార్యాలయమే సొంతంగా ప్రకటించడం గమనార్హం.
అమరీందర్ సింగ్ ప్రస్తుతం లండన్ లో వున్నారు. ఆయనకు వెన్నెముకకు సంబంధించిన శస్త్ర చికిత్స జరుగుతోంది. ఈ శస్త్రర చికిత్స తర్వాత ప్రధాని మోదీ ఆయనతో ఫోన్లో కూడా మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ వేసే చివరి తేదీ జూలై 19. ఆగపంటె 6 న ఎన్నికలు జరగనున్నాయి.