చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమతామూర్తి నిర్వాహకులకు సంబంధించి ఓ కొత్త వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ వివాదంతో తూనికలు, కొలతల శాఖ నిర్వాహకులపై ఏకంగా కేసులు నమోదు చేసింది. మెట్రాలజీ చట్టం 2009 లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.
ఆశ్రమంలో భక్తులకు విక్రయించే ప్రసాదం ప్యాకెట్లపై తయారీ తేదీ, ఎక్స్ పైరీ డేట్ ముద్రించనే లేదంటూ ఓ భక్తుడు ఏకంగా తూనికలు, కొలతల శాఖకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా ప్యాకెట్ పై వున్న బరువు, లోపల ప్రసాదం బరువుకు ఏమాత్రం పొంతన లేదని, తేడా వుందని కూడా ఫిర్యాదు చేశాడు.దీంతో తూనికలు, కొలతల శాఖ రంగంలోకి దిగి, ఆశ్రమ నిర్వాహకులపై కేసులు పెట్టింది.