వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై నవరంగ్ పూర్ పీఎస్ లో కేసు బుక్ అయ్యింది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ మహిళానేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మ ముర్ము పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, తక్షణమే ఆయన్ను అరెస్ట్ చేయానలి మహిళా నేత డిమాండ్ చేశారు. అత్యున్నత పదవి రేసులో వున్న నేతపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హేయమని మండిపడ్డారు.
ఎన్డీయే తన రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించిన నేపథ్యంలో ఆర్జీవీ వివాదాస్పద ట్వీట్ చేశాడు. ద్రౌపది రాష్ట్రపతి అయితే.. పాండవులు ఎవరు? కౌరవులు ఎవరు? అంటూ వివాదాస్పద ట్వీట్ చేశారు. దీంతో వివాదం ముదిరింది. ఆ తర్వాత ఆర్జీవీ వెనక్కి తగ్గాడు. ద్రౌపది అనగానే మహాభారతంలోని పాత్రలు గుర్తుకు వచ్చాయని, ఎవర్నీ కించపరచడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చాడు.