సామాజిక మాధ్యమాల్లో నగ్న చిత్రాలు పెట్టారన్న ఆరోపణపై బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ పై ముంబై పోలీసులు కేసులు పెట్టారు. ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన వ్యక్తి ముంబైలోని చెంబూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో రణవీర్ పై కేసు నమోదైంది. దీంతో ఐపీసీలోని వివిధ సెక్షన్లతో పాటు, ఐటీ చట్టంలోని పలు నిబంధనల కింద కేసులు నమోదయ్యాయి.
రణవీర్ ఓ మ్యాగజైన్ కోసం నగ్న చిత్రాలు తీసుకొని, వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టారని, ఆ ఫొటోల ద్వారా డబ్బులు సంపాదించుకున్నారని ఫిర్యాదు దారు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రణవీర్ ఫొటోలు మహిళల మనోభావాలు దెబ్బతీసేలా వున్నాయంటూ మహిళలు కూడా ఫైర్ అయ్యారు. కొందరు రణవీర్ కు మద్దతుగా వుంటే.. మరి కొందరు మాత్రం సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.