వివేకా హత్య కేసులో సిబిఐ మరింత దూకుడు పెంచింది. తాజాగా మూడో సారి కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే రెండు సార్లు ఆయన్ను విచారించి పలు రకాల ప్రశ్నలు వేశారు అధికారులు తొలిసారి విచారణకు హాజరైనప్పుడు పలు ప్రశ్నలకు ఎంపీ సమాధానాలు చెప్పలేదు. రెండోసారి కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటివేసినట్టు సమాచారం. మొత్తం నాలుగు గంటల పాటు విచారిస్తే ఆయన్న కొన్నింటికే సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో మరోసారి ఆయన్ను విచారణకు హాజరు కావాలి అంటూ ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేశారు. పులివెందుల లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చారు సీబీఐ అధికారులు. ఈ నెల 6వ తేదీన అంటే సోమవారం కచ్చితంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు సీబీఐ అధికారులు. అధికారులు వచ్చినప్పుడు ఎంపీ అవినాష్ ఇంట్లో లేకపోవడంతో ఆయన తండ్రి భాస్కర్రెడ్డికి వారి చెప్పి వెళ్లినట్టు సమాచారం.
