ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నివాసంపై నేటి ఉదయం సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. మద్యం పాలసీ వివాదంపై ఆయన ఇంట్లో సీబీఐ సోదాలు చేసినట్లు తెలుస్తోంది. మనీశ్ సిసోడియా నివాసంతో పాటు ఢిల్లీలోనే మరో 20 చోట్ల సీబీఐ దాడులు నిర్వహించింది. అయితే… ఈ సోదాలపై మనీశ్ సిసోడియా ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీబీఐ దాడులను తాము స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ దాడులకు తాను సహకరిస్తానని, నిజమేంటో తెలిసిపోతుందని అన్నారు. తాము చాలా నిజాయితీగా వున్నామని, లక్షల మంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. మంచి పనులు చేసే వారిని దాడులతో వేధించడం బాగోలేదని, అందుకే మన దేశం ఇలా వుంది అంటూ… సిసోడియా ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. అయితే.. సీబీఐ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని సిసోడియా పేర్కొన్నారు.
हम सीबीआई का स्वागत करते हैं. जाँच में पूरा सहयोग देंगे ताकि सच जल्द सामने आ सके. अभी तक मुझ पर कई केस किए लेकिन कुछ नहीं निकला. इसमें भी कुछ नहीं निकलेगा. देश में अच्छी शिक्षा के लिए मेरा काम रोका नहीं जा सकता.
— Manish Sisodia (@msisodia) August 19, 2022
సీబీఐ దాడులపై ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ స్పందించారు. సీబీఐ దాడులను తమ పార్టీ స్వాగతిస్తోందని ప్రకటించారు. తాము పూర్తిగా సహకరిస్తామని సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. గతంలోనూ ఇలాగే జరిగాయని, ఏదీ వెల్లడించలేదని, ఇప్పుడు కూడా అలాగే అవుతుందని అన్నారు. తాము అమలు చేస్తున్న విద్యా వ్యవస్థను మెచ్చుకుంటూ అమెరికాకి చెందిన ఓ పత్రిక కథనాన్ని రాస్తే… అదే రోజు సీబీఐని కేంద్రం పంపిందని కేజ్రీవాల్ మండిపడ్డారు.
जिस दिन अमेरिका के सबसे बड़े अख़बार NYT के फ़्रंट पेज पर दिल्ली शिक्षा मॉडल की तारीफ़ और मनीष सिसोदिया की तस्वीर छपी, उसी दिन मनीष के घर केंद्र ने CBI भेजी
CBI का स्वागत है। पूरा cooperate करेंगे। पहले भी कई जाँच/रेड हुईं। कुछ नहीं निकला। अब भी कुछ नहीं निकलेगा https://t.co/oQXitimbYZ
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 19, 2022