మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విచారణకు రావాలని భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులిచ్చింది. సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం పులివెందులలోని భాస్కర్ రెడ్డి నివాసానికి సీబీఐ అధికారులు వెళ్లి, నోటీసులు అందజేశారు.
ఈ నెల 12 న విచారణకు రావాలని సూచించారు. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌజ్ లేదా… హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి విచారణ నిమిత్తం రావాలని సూచించింది. అయితే… గత నెల 18 న విచారణకు రావాలని వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులిచ్చింది. అయితే… ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలతో విచారణకు రాలేకపోతున్నానని పేర్కొన్నారు. దీంతో ఈ నెల 12 న విచారణకు రావాలని సీబీఐ మరోసారి నోటీసులిచ్చింది.