Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

బీజేపీ ఆదేశాలనే.. సీబీఐ అమలు : కేజ్రీవాల్‌ ఆరోపణ

బీజేపీ ఆదేశాలను సీబీఐ అనుసరిస్తుందని, ఒకవేళ తనను అరెస్టు చేయాలని ఆ పార్టీ చెప్పి ఉంటే అదేపని చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌  అన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ  వ్యవహారంలో విచారణకు రావాలని కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు విచారణకు రావాలని సీబీఐ తనను పిలిచిందని, తప్పనిసరిగా హాజరువుతానని కేజ్రీవాల్‌  చెప్పారు. వారు చాలా పవర్‌ఫుల్‌. ఎవరినైనా జైలుకు పంపించగలరని అన్నారు. బీజేపీ ఆదేశాలనే సీబీఐ అనుసరిస్తుందన్నారు. కమలం పార్టీ నేతలు తనపై అవినీతి ముద్ర వేస్తున్నారని చెప్పారు.

Related Posts

Latest News Updates