ఏపీలోని కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. కొవ్వాడతో పాటు జైత్ పూర్, గుజరాత్ లోని ఛాయ, మిథివర్ధి, బెంగాల్ లోని హరిపూర్, మధ్యప్రదేశ్ లోని భీమ్ పూర్ లో కూడా అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని పీఎంవో సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ఈ ప్రశ్నను లేవనెత్తగా… కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పై విధంగా జవాబిచ్చారు.
కొవ్వాడలో 1,208 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 అణు రియాక్టర్లను నిర్మించడానికి కేంద్రం రెడీ అయ్యిందని కేంద్ర మంత్రి ప్రకటించారు. దేశం మొత్తంలో 7 వేల మెగావాట్ల అణువిద్యుత్ ఉత్పవాదన కోసం కర్నాటక, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో 10 అణు రియాక్టర్లను నెలకొల్పేందుకు ఆర్థిక, పాలనాపరమైన ఆమోదం ఇచ్చామని జితేంద్ర సింగ్ ప్రకటించారు. ఈ 10 రియాక్టర్ల నిర్మాణం 2031 నాటికి పూర్తవుతుందని ప్రకటించారు.