ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ పునరుజ్జీవానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థకు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించింది. 1.64 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు కేంద్ర కేబినెట్ ప్రకటించింది. దీనికి ఆమోద ముద్ర కూడా వేసింది. ఈ విషయాన్ని టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. కేవలం ప్యాకేజీ మాత్రమే కాకుండా బీఎస్ఎన్ఎల్, బీబీఎన్ఎల్ విలీనానికి కూడా కేంద్రం ఆమోద ముద్ర వేసింది. మొత్తం ప్యాకేజీలో 43,964 కోట్లను నగదు రూపంలో, మిగిలిన 1.2 లక్షల కోట్లు నాలుగేళ్ల కాలానికి నగదు రహితంగా అందిస్తామని మంత్రి తెలిపారు. 4జీ సేవల కోసం 900/1800 స్పెక్ట్రమ్ ను బీఎస్ఎన్ఎల్ కు కేటాయిస్తారు. ఇందుకోసం అయ్యే మొత్తం 44,993 కోట్లను ఈక్విటీలుగా మార్చారు.
