ఇన్ని రోజుల పాటు తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం బ్యాన్ విధించింది. తాజాగా కొన్ని వాట్సాప్ గ్రూప్ లపై కూడా కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది. కేంద్రం తాజాగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ ఘటనలు వాట్సాప్ గ్రూపుల ఆధారంగా, ముందస్తు ప్రణాళికలతోనే జరిగాయని పోలీసులు పేర్కొంటున్నారు. దీంతో అగ్నిపథ్, అగ్నిపథ్ వీరులకు సంబంధించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేసే 35 వాట్సాప్ గ్రూపులను కేంద్రం నిషేధించింది.
వాట్సాప్ గ్రూపుల్ లో తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్రం పక్కాగా గుర్తించే ఈ చర్యలకు ఉపక్రమించింది. అగ్నిపథ్ పై లేనిపోని తప్పుడు అపోహలను ప్రచారం చేస్తున్నారని కేంద్రం ఫైర్ అయ్యింది. అయితే నిషేధం విధించిన వాట్సాప్ గ్రూపుల వివరాలను మాత్రం బయటికి రానివ్వడం లేదు. ఇలా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వాట్సాప్ గ్రూపులకు చెందిన 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వైపు రైల్వే స్టేషన్లలో విధ్వంసానికి కారుకులైన వారిని కూడా గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.